Rishi Kapoor: ప్రతి రోజు కొద్దిసేపైనా మద్యం షాపులు తెరవండి: సీనియర్ నటుడు రిషి కపూర్

Government should open all licensed liquor stores

  • ఇంటికే పరిమితమైన వారు అనిశ్చితి, నిరాశలో ఉంటారు
  • వారికి మద్యం అవసరం చాలా వుంటుంది
  • తప్పుగా అర్థం చేసుకోవద్దు

లాక్‌డౌన్ కారణంగా మద్యం దొరక్క అల్లాడిపోతున్న వారికి బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్ అండగా నిలిచాడు. రోజూ సాయంత్రం కొంతసేపైనా మద్యం దుకాణాలు తెరవాలని ప్రభుత్వాన్ని కోరాడు. తన విజ్ఞప్తిని ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన వారు అనిశ్చితి, నిరాశలో మునిగి ఉంటారని, ఇలాంటి సమయంలో వారికి మద్యం అవసరం చాలా ఉంటుందని రిషికపూర్ అభిప్రాయపడ్డాడు. కాబట్టి బ్లాక్‌లో అయినా అమ్మితేనే బాగుంటుందని ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరాడు.

రిషికపూర్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి అనూహ్య మద్దతు లభించింది. నటుడి అభిప్రాయంతో ఏకీభవిస్తూ కామెంట్లతో ట్విట్టర్‌ను హోరెత్తించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం, దాహంతో ఉన్న వారికి నీళ్లు ఎంత అవసరమో, మద్యం బాబులకు మందు కూడా అంతే అవసరమంటూ భావాత్మక పోస్టులతో నింపేస్తున్నారు. అయితే, ఇలాంటి సమయంలో షాపులు తెరవడం సాహసమే అవుతుందని మరికొందరు పేర్కొన్నారు. మద్యం షాపులు తెరిస్తే రద్దీని తట్టుకోవడం కష్టమని మరికొందరు అభిప్రాయపడ్డారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News