Singitam Srinivasarao: చానాళ్ల తరువాత మెగాఫోన్ పట్టుకోనున్న సింగీతం... హీరోయిన్ గా తొలుత అనుష్క, ఇప్పుడు సమంత!

Singitam Wants Samantha in Nagaratnamma Biopic

  • ఎన్నో వినూత్న చిత్రాలకు దర్శకత్వం
  • కన్నడ సంగీత కళాకారిణి నాగరత్నమ్మ బయోపిక్ కు ప్లాన్ చేస్తున్న సింగీతం
  • దేవదాసి నుంచి విఖ్యాత కళాకారిణిగా ఎదిగిన నాగరత్నమ్మ

పుష్పకవిమానం, ఆదిత్య 369 వంటి ఎన్నో వినూత్న చిత్రాలకు దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావు, చానాళ్లుగా మెగా ఫోన్ కు దూరమయ్యారు. వృద్ధాప్యం కారణంగా దర్శకత్వ బాధ్యతలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు ప్రముఖ కన్నడ సంగీత కళాకారిణి నాగరత్నమ్మ జీవితాన్ని బయోపిక్ గా తెరకెక్కించాలని భావిస్తున్నారు. చిన్నతనంలో పేదరికంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, దేవదాసీగా జీవితాన్ని ప్రారంభించి, సమాజంలో అవమానాలు పడి, ఆపై సంగీత కళాకారిణిగా జగద్వితమైన ఖ్యాతిని గడించిన నాగరత్నమ్మ జీవితంలో సినిమాకు కావాల్సిన అన్ని రసాలూ ఉన్నాయని గమనించిన సింగీతం, ఆమె జీవితాన్ని సినిమా రూపంలో తీయాలని భావించారు.

కాగా, తొలుత ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు అనుష్క అయితే బాగుంటుందని సింగీతం భావించారట. అయితే, ఇప్పుడు తాజాగా సమంత పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం గ్లామ‌ర్ పాత్ర‌ల కన్నా నటనకు ఆస్కారమున్న పాత్రలకే ప్రాధాన్యమిస్తున్న సమంతను ఇప్పటికే సింగీతం సంప్రదించారని తెలుస్తోంది. ఇక సింగీతం అనుష్కను ఎందుకు వద్దనుకున్నారో, సమంత ఈ చిత్రాన్ని చేస్తుందో లేదో తెలియరాలేదు.

Singitam Srinivasarao
Nagaratnamma
Biopic
Anushka Shetty
Samantha
  • Loading...

More Telugu News