Sadguru: ఆహారం దొరక్క ప్రజల్లో అశాంతి చెలరేగే అవకాశం ఉంది: సద్గురు
- కరోనా పరిస్థితులపై సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పందన
- లాక్ డౌన్ తో కూలీలు, పేదలు పస్తులు ఉండాల్సి రావొచ్చని వెల్లడి
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలంటీర్లు ముందుకు రావాలని విజ్ఞప్తి
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పందించారు. లాక్ డౌన్ విధించడం వల్ల దినసరి కూలీలు, పేద కుటుంబాల వారు ఉపాధి కోల్పోయి పస్తులు ఉండే పరిస్థితులు రావొచ్చని అభిప్రాయపడ్డారు. ఆహారం దొరక్క ఆకలితో ప్రజల్లో అశాంతి చెలరేగే అవకాశం ఉందని హెచ్చరించారు.
పేదలను ఆదుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని, భారత్ లో కనీసం ఇద్దరు పేదవాళ్లకు ఒక స్వచ్ఛంద సేవకుడు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన, కరోనా బాధితులకు వైద్య సేవలు అందించేందుకు తమ ఇషా ఫౌండేషన్ కు చెందిన భవనాలను ఉపయోగించుకోవచ్చని సద్గురు తమిళనాడు ప్రభుత్వానికి తెలిపారు.