Kesineni Nani: అన్న క్యాంటీన్లకు మీకు ఇష్టమైన పేరు పెట్టుకుని ఇప్పటికైనా తెరవండి: కేశినేని నాని

TDP MP Kesineni Nani wants to re open Anna Canteens

  • తెలుగు రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్
  • తెలంగాణలో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా పేదలకు ఉచితభోజనం
  • ఏపీలో మూసివేసిన అన్న క్యాంటీన్లు తెరవాలని కేశినేని విజ్ఞప్తి

తెలంగాణలో కరోనా లాక్ డౌన్ దృష్ట్యా ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా పేదలకు ఉచితంగా ఆహారం అందించడం పట్ల టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ఏపీలో కూడా మూసివేసిన క్యాంటీన్లను ఇప్పుడైనా తెరవాలని విజ్ఞప్తి చేశారు. "ఆ క్యాంటీన్లకు మీకు ఇష్టమైన పేరు పెట్టుకోండి, ఇటువంటి సమయంలో ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. ఇది సలహా మాత్రమే" అంటూ ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News