Manchu Vishnu: నా సాయాన్ని పొంది మరిచిపోయినవాళ్లు చాలామందే వున్నారు: హీరో విష్ణు

Manchu Vishnu

  • చాలామందికి సాయపడ్డాను
  • సమస్యల్లో వున్నప్పుడే నేను గుర్తొస్తాను  
  •  ప్రతిఫలాన్ని ఆశించి ఏదీ చేయనన్న విష్ణు

తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ, తనకి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఒకరు చేసిన సాయాన్ని నేను ఎప్పుడూ మరచిపోను. కృతజ్ఞత చూపకపోతే జీవితమే వృథా అనుకుంటాను. కానీ నా నుంచి సాయాన్ని పొంది, ఆ విషయాన్ని మరిచిపోయినవాళ్లు చాలామందే వున్నారు. వాళ్లలో కొంతమంది దర్శకులు .. ఆర్టిస్టులు .. వున్నారు.

అయితే వాళ్లు అలా చేశారని నేను ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే ఎవరి నుంచి ప్రతిఫలాన్ని ఆశించకుండానే నేను సాయం చేస్తాను. అందువలన అవతలివారు ఏమీ చేయకపోయినా నేను దాని గురించి ఆలోచన చేయను. అలాంటివాళ్లు ఏదో ఒక సమస్య వచ్చినపుడు నాకు కాల్ చేస్తే, పాత విషయాలు పట్టించుకోకుండా మళ్లీ సాయం  చేసిన సందర్భాలు కూడా వున్నాయి. అలాంటివాళ్లకి మళ్లీ సాయపడటం అవసరమా అని మా ఆవిడ అంటుంది. అయినా పట్టించుకోకుండా నేను చేయగలిగినంత చేస్తుంటాను" అని చెప్పుకొచ్చాడు.

Manchu Vishnu
TNR
Tollywood
  • Loading...

More Telugu News