MS Dhoni: ధోనీ భవిష్యత్తుపై హర్ష భోగ్లే సంచలన వ్యాఖ్యలు

Dhoni career is over says  Harsha Bhogle
  • ధోనీకి అన్ని దారులు మూసుకుపోయినట్టే
  • ఇండియాకు మరోసారి ఆడాలనే కోరిక నెరవేరక పోవచ్చన్న హర్ష
  • ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ధోనీ చిన్ననాటి కోచ్ 
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి అన్ని దారులు మూసుకుపోయినట్టేనని క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే అభిప్రాయపడ్డారు. ఇండియాకు మరోసారి ఆడాలనే ధోనీ కోరిక నెరవేరకపోవచ్చని చెప్పారు. ధోనీ చిన్ననాటి కోచ్ రంజన్ బెనర్జీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత జట్టులో తిరిగి స్థానాన్ని దక్కించుకోవడం ధోనీకి కష్టమని ఆయన చెప్పారు. ఐపీఎల్ కూడా వాయిదా పడటంతో... తిరిగి సత్తా చాటి జట్టులోకి రావాలనుకున్న ధోనీ ఆశలు నెరవేరడం కష్టమేనని అన్నారు. అయితే ధోనీకి బీసీసీఐ చివరి అవకాశం ఇస్తుందని... టీ20 వరల్డ్ కప్ లో ధోనీకి చివరి అవకాశం ఉండొచ్చని చెప్పారు.
MS Dhoni
Harsha Bhogle
BCCI
Team India

More Telugu News