Madhavi Latha: పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సినీ నటి మాధవీలత

Actress Madhavi Latha condemns Police action
  • ఇంటి నుంచి బయటకు వచ్చిన వారిని కొట్టడమేంటి?
  • ఫైన్ వేయాలి, లేదా కేసు పెట్టాలి
  • అత్యవసరం ఉన్నవారు మాత్రమే బయటకు వస్తున్నారు
ఇండియాలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని పిలుపునిచ్చింది. అయినా కొందరు మాత్రం ఈ హెచ్చరికలను పక్కన పెట్టి రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో, రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు లాఠీలతో కొడుతున్న అనేక వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో, పోలీసుల తీరును సినీ నటి మాధవీలత తప్పుపట్టింది. స్టుపిడ్ పోలీసులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బయటకు వచ్చిన వారికి ఫైన్ వేయాలని లేదా కేసులు పెట్టాలని... అంతేతప్ప ఇలా దారుణంగా కొట్టడమేమిటని ఆమె ప్రశ్నించింది. అత్యవసరం ఉన్నవారు మాత్రమే బయటకు వస్తున్నారని... పనిపాటా లేని వారు ఒకరిద్దరు బయటకు వస్తే, మిగిలిన వారిని కూడా కొట్టడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. పోలీసుల చర్య సమర్థనీయం కాదని వ్యాఖ్యానించింది.
Madhavi Latha
Tollywood
Corona Virus
Local Body Polls
Police

More Telugu News