Corona Virus: కరోనా వచ్చిందేమోనన్న భయంతో కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య!

man commits suicide

  • సూర్యాపేటలో ఘటన
  • తీవ్ర దగ్గు, జ్వరంతో ఇంట్లోనే వ్యక్తి
  • ఆసుపత్రికి కూడా వెళ్లని వైనం

మనుషుల్లో కరోనా వైరస్‌ భయం పెరిగిపోతోంది. ధైర్యంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నప్పటికీ చాలా మంది వణికిపోతున్నారు. ఈ క్రమంలో తనకు కరోనా వచ్చిందేమోనన్న భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో చోటుచేసుకుంది.

శ్రీనివాస్‌ అనే వ్యక్తి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. తీవ్ర దగ్గు, జ్వరంతో ఇంట్లో ఉంటున్నాడు. ఆసుపత్రికి కూడా వెళ్లకపోవడంతో మరింత కుంగిపోయాడు. కరోనా సోకిందేమోనని తీవ్ర ఆందోళన చెందాడు. చివరకు శరీరంపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత‌్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Corona Virus
Telangana
Suryapet District
  • Loading...

More Telugu News