Visakhapatnam: కరోనాకు 'గొడుగు'తో అడ్డు... అదే నియంత్రణ ఆయుధం!

umbarilla very usefull to avoid corona virous says doctor suryaprakasharao

  • గొడుగుతో వైరస్ విస్తరణ ఆపొచ్చంటున్న డాక్టర్ కూటికుప్పల 
  • బయటకు వెళితే తప్పనిసరిగా వినియోగించాలని సూచన 
  • సామాజిక దూరంతోపాటు వైరస్ నుంచి రక్షణ

ఒకప్పుడు పెద్దలు బయటకు వెళితే ఓ చేతిలో గొడుగు, మరో చేతిలో గుడ్డ సంచి తప్పనిసరిగా పట్టుకు వెళ్లేవారు. ఎండావానల నుంచి రక్షణగా ఉంటుందని గొడుగు, దారిలో ఏదైనా కొంటే తెచ్చుకునేందుకు వీలుగా గుడ్డ సంచి పట్టుకు వెళ్లేవారు. ఈ రెండింటిని మనం ఎప్పుడో వదిలేశాం. కానీ ఇప్పుడు అదే గొడుగు కరోనా నుంచి మనల్ని రక్షించేందుకు ఉపయోగపడుతుందంటున్నారు విశాఖకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు.

గొడుగు వినియోగించడం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సామాజిక దూరం సిద్ధాంతాన్ని పాటించవచ్చని ఆయన చెబుతున్నారు. అదెలా అంటే... సామాజిక దూరంలో భాగంగా కనీసం మూడు అడుగుల దూరం పాటించాలన్నది నిబంధన. గొడుగులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు తమకు తెలియకుండానే కనీసం మీటరు దూరం పాటిస్తారని డాక్టర్ సూర్యారావు చెప్పారు.

అలాగే, ఎదుటివారు తుమ్మినా, దగ్గినా వారి నోటి నుంచి వెలువడే తుంపర్లను గొడుగు అడ్డుకుంటుందని చెప్పారు. బయట నుంచి రాగానే ఆ గొడుగును ఓ గంటపాటు ఎండలో ఉంచితో అప్పటికే దానిపై ఏమైనా వైరస్ చేరి ఉంటే చనిపోతుందని, తర్వాత దాన్ని శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవచ్చని సూచించారు.

అందువల్ల మార్కెట్ కు గాని, రైతు బజార్‌కుగాని వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా గొడుగు వినియోగించాలని సూచిస్తున్నారు డాక్టర్ కూటికుప్పల.

  • Loading...

More Telugu News