Nani: 'శ్యామ్ సింగ్ రాయ్' సెకండాఫ్ పూర్తిగా డిఫరెంట్

Shyam Sing Rai Movie

  • 'టాక్సీవాలా' దర్శకుడితో నాని తదుపరి చిత్రం 
  • సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  •  త్వరలోనే ఇతర నటీనటుల వివరాలు

నాని తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వి' సిద్ధమవుతోంది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై, అభిమానులందరిలో ఆసక్తి వుంది. ఆ తరువాత సినిమాగా నాని 'శ్యామ్ సింగ్ రాయ్' చేయనున్నాడు. 'టాక్సీవాలా' దర్శకుడు రాహుల్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.

విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో నాని డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడని చెబుతున్నారు. ఇక సెకండాఫ్ ను ఎంతో ఉత్కంఠ భరితంగా డిజైన్ చేశారట. సెకండాఫ్ లో నాని నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. నాని కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకమైందిగా నిలవడం ఖాయమని చెబుతున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు.

  • Loading...

More Telugu News