shabarimala temple: లాక్ డౌన్ ఎఫెక్ట్.. వాయిదాపడ్డ శబరిమల వార్షిక ఉత్సవాలు

Shabarimala temple annual celebrations postponed

  • కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమల
  • ఈ నెల 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న వార్షిక ఉత్సవాలు
  • ‘కరోనా’ కారణంగా వాయిదా వేస్తున్నామన్న ఆలయ ప్రధాన పూజారి

కరోనా వైరస్ దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పెళ్లిళ్లు, పేరంటాలు, వేడుకలు, ఉత్సవాలు అన్నింటినీ రద్దు చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో భక్తుల ప్రవేశాలకు అనుమతులు లేవు. తాజాగా, కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమలలో నిర్వహించాల్సిన ఉత్సవాలను వాయిదా వేశారు. ఈ మేరకు శబరిమల ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరారు తెలిపారు. ఈ ఉత్పవాలు ప్రతి ఏటా మార్చి నెలలో పది రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పారు. అయితే, ఈ నెల 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న వార్షిక ఉత్సవాలను ‘కరోనా’ కారణంగా వాయిదా వేస్తున్నామని చెప్పారు.

shabarimala temple
Annual Celebrations
postponed
  • Loading...

More Telugu News