Jr NTR: రామ్ చరణ్, నా మాట నిలబెట్టుకున్నా... ఇదిగో గిఫ్టు: జూనియర్ ఎన్టీఆర్

Jr NTR gives Ramchara as he promised

  • ఇవాళ రామ్ చరణ్ బర్త్ డే
  • గిఫ్ట్ ఇస్తానంటూ నిన్నటి నుంచి ఊరిస్తున్న ఎన్టీఆర్
  • ఎట్టకేలకు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను షేర్ చేసిన వైనం

టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా చరణ్ బెస్ట్ ఫ్రెండ్, ఆర్ఆర్ఆర్ లో సహ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన గిఫ్ట్ అందించాడు. అదేంటో కాదు, ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ ఫస్ట్ లుక్. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. దీనిపై నిన్నటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ హడావుడి మొదలుపెట్టాడు. చరణ్ రేపు నీకు మర్చిపోలేని డిజిటల్ గిఫ్ట్ ఇస్తానంటూ ఊరించాడు.

అయితే, ఇవాళ ఉదయం మరలా, అయ్యో చరణ్ ఆ గిఫ్ట్ రాజమౌళి వద్దకు చేరిందంటూ ఉడికించాడు. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి సైతం రంగప్రవేశం చేసి మరీ ఇంత నిరాశకు గురిచేస్తారా అంటూ చిరుకోపం ప్రదర్శించారు. ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ తన మాట నిలుపుకున్నాడు. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ, "నేను మాటిచ్చిన విధంగా ఇదిగో నా కానుక. అందుకో రామ్ చరణ్! హ్యాపీ బర్త్ డే బ్రదర్. మన అనుబంధం ఎప్పటికీ ఇలాగే నిలవాలి" అంటూ ట్వీట్ చేశాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News