RRR: 'ఇంటిపేరు అల్లూరి... సాకింది గోదారి... నా అన్న మన్నెం దొర'... అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో రామ్ చరణ్ ఫస్ట్ లుక్... వీడియో ఇదిగో!

Ram Charan Teaser Firstlook from RRR

  • ఆలస్యమైనా రామ్ చరణ్ కు సూపర్బ్ బర్త్ డే గిఫ్ట్
  • 1.13 నిమిషాల వీడియోతో ఫ్యాన్స్ కు సైతం ఫీస్ట్
  • పలు భాషల్లో విడుదలైన వీడియోకు మంచి రెస్పాన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కాస్తంత ఆలస్యమైనా పక్కా బర్త్ డే గిఫ్ట్ దొరికింది. రాజమౌళి సినిమా అసలు సిసలైన స్టయిల్ ను పరిచయం చేస్తూ 'రౌద్రం రణం రుధిరం' నుంచి అల్లూరి సీతారామరాజును పరిచయం చేస్తూ, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో 1.13 నిమిషాల నిడివి వున్న ఫస్ట్ లుక్ టీజర్, తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదలైంది. మూడింటిలోనూ ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పారు.

"ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది. కలబడితే ఏగుచుక్క ఎగబడినట్టుంటది. ఎదురుబడితే చావుకైనా చెమటలు ధారకడతది. పాణమైనా, బందూకైనా వానికి బాంచనైతది. ఇంటి పేరు అల్లూరి. సాకింది గోదారి. నా అన్న... మన్నెం దొర... అల్లూరి సీతారామరాజు" అంటూ ఎన్టీఆర్ పరిచయం సాగింది.

ఇక ఇందులో రామ్ చరణ్ కసరత్తులు, ధ్యానం చేయడం తుపాకి, బాణాలను ప్రయోగించడం వంటి దృశ్యాల కట్స్ కనిపిస్తున్నాయి. విడుదలైన రెండు నిమిషాల వ్యవధిలోనే తెలుగు వర్షన్ వ్యూస్ లక్ష దాటింది. తమిళ్, హిందీ, కన్నడ, మళయాల భాషల్లోనూ ఇదే ఫస్ట్ లుక్ విడుదలైంది.

RRR
Roudram Ranam Rudhiram
Ramcharan
Junior NTR
  • Error fetching data: Network response was not ok

More Telugu News