Junior NTR: తమిళ, హిందీ భాషల్లోను వినిపించనున్న ఎన్టీఆర్ .. చరణ్ వాయిస్

RRR Movie

  • షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పనున్న ఎన్టీఆర్ -  చరణ్ 
  •  లాక్ డౌన్ ఎత్తివేయగానే షూటింగ్

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తుండగా, ఇప్పటికే చాలా వరకూ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ కూడా విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఎన్టీఆర్ .. చరణ్ తమ పాత్రలకి తామే డబ్బింగ్ చెప్పనున్నారనేది తాజా సమాచారం. అంటే తమిళ .. హిందీ వెర్షన్లలో ఎన్టీఆర్ .. చరణ్ వాయిస్ లే వినిపించనున్నాయన్న మాట. దీనిని బట్టి ఎన్టీఆర్ .. చరణ్ లకు తమిళ .. హిందీ భాషలపై కూడా మంచి పట్టు ఉందని అర్థమవుతోంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్, లాక్ డౌన్ ఎత్తివేయగానే మొదలవుతుందని అంటున్నారు.

Junior NTR
Charan
Rajamouli
RRR Movie
  • Loading...

More Telugu News