Jagan: సీఎం జగన్ ను కలసి, రూ.5 కోట్ల విరాళం అందించిన మేఘ సంస్థల అధినేత

  • కరోనా మహమ్మారిపై పోరుకు మేఘ సంఘీభావం
  • ఏపీ సీఎం సహాయనిధికి భారీ విరాళం
  • ఇప్పటికే తెలంగాణకు రూ.5 కోట్లు అందజేత
కరోనా సహాయ చర్యల కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి రూ.5 కోట్ల విరాళం అందించిన మేఘ ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తాజాగా ఏపీకి కూడా భారీగా విరాళం ప్రకటించింది. మేఘ సంస్థల అధినేత కృష్ణారెడ్డి ఏపీ సీఎం జగన్ ను కలసి రూ.5 కోట్ల చెక్ అందించారు. కరోనా నివారణ, సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి ఈ విరాళం ఇస్తున్నట్టు కృష్ణారెడ్డి తెలిపారు. అటు సినీ ప్రముఖుల నుంచి కూడా రాష్ట్రానికి గణనీయమైన స్థాయిలో విరాళాలు అందుతున్నాయి. దాదాపు అగ్రనటులందరూ సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు.
Jagan
Megha
Corona Virus
Donation
Andhra Pradesh
COVID-19

More Telugu News