Harbhajan Singh: పోలీసుల పట్ల మన ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవాలి: హర్భజన్

Harbhajan Singh in support for police

  • కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్
  • పలు ప్రాంతాల్లో పోలీసులపై దాడులు!
  • ప్రజల వైఖరిని ఖండించిన హర్భజన్

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించగా, అక్కడక్కడ పోలీసులపైనే దాడులు జరుగుతుండడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. మనం ఇళ్లలో ఉన్నా, మనకోసం వాళ్లు జీవితాలను లెక్కచేయకుండా పనిచేస్తున్నారని, అలాంటి వాళ్లపై దాడులు చేయడం సరైన విధానం కాదని హితవు పలికాడు. పోలీసుల పట్ల మన ఆలోచనా వైఖరిని మార్చుకోవాలని, వాళ్లకు కూడా కుటుంబాలు ఉన్నా దేశం కోసం పనిచేస్తున్నారని, ఆ విషయం గుర్తెరిగి పోలీసుల పట్ల గౌరవభావంతో నడుచుకోవాలని సూచించాడు. మన భవిష్యత్ కోసమే బయట తిరగొద్దని చెబుతున్నారని, మనం వాళ్ల సూచనలను ఎందుకు పాటించకూడదు? అంటూ ప్రశ్నించాడు.

Harbhajan Singh
Police
India
Corona Virus
Lockdown
  • Loading...

More Telugu News