Raviteja: మళ్లీ హీరోను వెదికే పనిలో పడిన అజయ్ భూపతి

Mahasamudram Movie

  • 'ఆర్ ఎక్స్ 100'తో హిట్
  • పట్టాలెక్కని 'మహా సముద్రం'
  • ఆలోచనలో పడిన అజయ్ భూపతి

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి భారీ విజయాన్నే అందుకున్నాడు. ఈ సినిమాతో ఆయన యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. ఆ వెంటనే ఆయన 'మహాసముద్రం' అనే కథను సిద్ధం చేసుకున్నాడు. రవితేజ కథానాయకుడిగా ఆయన ఈ సినిమాను రూపొందించాలని అనుకున్నాడు. అయితే ఈ కథ విషయంలో కొంతకాలం పాటు ఊగిసలాడిన రవితేజ, ఆ తరువాత నో చెప్పేశాడు.

దాంతో ఈ కథను నాగ చైతన్యతో చేయడానికి అజయ్ భూపతి గట్టి ప్రయత్నమే చేశాడు. అయితే చైతూ ఈ కంటెంట్ పై అంతగా ఆసక్తిని చూపలేదు. ఈ నేపథ్యంలో శర్వానంద్ తో ముందుకెళ్లాలని అజయ్ భూపతి భావించాడు. కథ వినగానే బాగుందనే ఉద్దేశంతోనే శర్వానంద్ వెయిటింగులో పెట్టాడు. అయితే వరుస పరాజయాలు ఎదురవుతున్న పరిస్థితుల్లో ప్రయోగాలు చేయడం అవసరమా? అనే ఆలోచనలో పడిన ఆయన, సున్నితంగానే తిరస్కరించాడట. దాంతో అజయ్ భూపతి మళ్లీ హీరోను వెదికే పనిలో పడ్డాడని అంటున్నారు.

Raviteja
Naga Chaitanya
Sharwanand
Mahasamudram Movie
  • Loading...

More Telugu News