Charan:  అనిల్ రావిపూడిపై దృష్టి పెట్టిన చరణ్!

Anil Ravipudi Movie

  • వరుస విజయాలతో అనిల్ రావిపూడి 
  •  ఆసక్తిని చూపిన బాలకృష్ణ 
  • ఉత్సాహపడుతున్న చరణ్  

తెలుగులో పూర్తి వినోదభరిత చిత్రాలను తెరకెక్కిస్తూ వరుస విజయాలను సాధిస్తున్న దర్శకుడిగా అనిల్ రావిపూడి కనిపిస్తాడు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు కలుపుతూ నాన్ స్టాప్ గా నవ్వించే దర్శకుడిగా ఆయనకి మంచి పేరు వుంది. పూర్తిస్థాయి వినోదభరిత చిత్రం చేయాలనుకునే హీరోలు, ముందుగా అనిల్ రావిపూడినే దృష్టిలో పెట్టుకుంటున్నారట.

ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి బాలకృష్ణ ఆసక్తిని చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక చరణ్ కూడా అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో వున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. 'ఆర్ ఆర్ ఆర్' తరువాత కొరటాలతోను .. ఆ తరువాత త్రివిక్రమ్ తోను చరణ్ సినిమాలు చేయనున్నాడు. ఆ రెండు ప్రాజెక్టుల తరువాత అనిల్ రావిపూడితో చరణ్ సినిమా ఉండొచ్చని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

Charan
Koratala Siva
Trivikram
Anil Ravipudi
  • Loading...

More Telugu News