Actress Trisha: కరోనా వైరస్‌కు అలాంటివేవీ తెలియదు.. జాగ్రత్త: నటి త్రిష

Actress Trisha advice about coronavirus
  • వైరస్‌కు ప్రాంతం, భాష, వయసు వంటివేవీ తెలియదు
  • ఇది ఒక రాష్ట్రానికి, ప్రాంతానికే పరిమితం కాదు
  • మనల్ని మనం, సమాజాన్ని కాపాడుకునేందుకు ఇంట్లో ఉండాల్సిందే
కరోనా వైరస్‌కు ప్రాంతం, భాష, వయసు వంటివేవీ తెలియదని, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని నటి త్రిష హెచ్చరించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని సూచించింది. కరోనా ప్రభావం ఒక రాష్ట్రం, ఒక ప్రాంతానికే పరిమితం కాదని, అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది. అయితే, ఇన్ని రోజులు ఇంట్లో ఉండడం కష్టమే అయినప్పటికీ తప్పదని పేర్కొంది. అందరూ ఐకమత్యంగా ఉండి ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని, మనల్ని మనం కాపాడుకుంటూ ఈ సమాజాన్ని కాపాడుకుందామని త్రిష పిలుపునిచ్చింది.
Actress Trisha
Corona Virus
Lockdown

More Telugu News