Harish Rao: రేపటి నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ: తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు
- ప్రతి ఒక్కరికీ ఉచితంగా 12 కిలోల బియ్యం పంపిణీ చేస్తాం
- రేషన్ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశాం
- ప్రతి రేషన్ కార్డు దారుడికి రూ.1500 చొప్పున అందిస్తాం
రేపటి నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ ప్రారంభమవుతుందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ ఉచితంగా 12 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని, రేషన్ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
వారం రోజుల పాటు ప్రతి ఒక్కరికీ బియ్యం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశామని, ప్రతి రేషన్ కార్డు దారుడికి రూ.1500 చొప్పున అందిస్తామని అన్నారు. ఈ మొత్తాన్ని ‘ఈ-కుబేర్’ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే ఏప్రిల్ 1 నుంచి జమ అవుతుందని తెలిపారు. నిత్యావసర వస్తువుల సరఫరా గురించి ఆయన మాట్టాడుతూ, రైతుల నుంచి కూరగాయలు జంట నగరాలకు సరఫరా చేసేందుకు పాసులు జారీ చేస్తామని, కూరగాయలు తీసుకెళ్లే వాహనాలు బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలు బయటకు వచ్చినప్పుడు వారం రోజులు సరిపడా సరుకులు తీసుకెళ్లాలని సూచించారు.