Pavan kalyan: పవన్ కల్యాణ్ భారీ విరాళంపై స్పందించిన హరీశ్ శంకర్

Corona Virus

  • తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న కరోనా 
  • బాధితుల సహాయార్థం ముందుకొచ్చిన పవన్ 
  • అభినందించిన హరీశ్ శంకర్

వివిధ దేశాల్లో కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోంది. భారత్ లోను ఈ వైరస్ బలపడుతూ వెళుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వెళుతోంది. దాంతో రెండు ప్రభుత్వాలు కూడా కరోనాను కట్టడి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక వైపున ఆరోగ్యపరమైన చర్యలు .. మరో వైపున ఆర్ధిక పరమైన చర్యలు తీసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే కరోనా బాధితుల సహాయార్థం జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ రిలీఫ్ ఫండ్ కి మరో కోటి రూపాయలను ప్రకటించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పెద్ద మొత్తంలో విరాళాన్ని ప్రకటించింది పవన్ కల్యాణ్ కావడం విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్ స్పందిస్తూ, "కొంతమందికి సినిమా అవసరం .. కొంతమంది సినిమాకు అవసరం" అంటూ పవన్ వ్యక్తిత్వాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో త్వరలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.

Pavan kalyan
Harish Shankar
Corona Virus
Tollywood
  • Loading...

More Telugu News