Ganta Srinivasa Rao: చిరంజీవి అన్నయ్య మంచి చొరవ తీసుకున్నారు: గంటా శ్రీనివాసరావు

Ex Minister Ganta Srinivas wishesh Chiranjeev

  • ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన చిరంజీవికి ‘వెల్ కమ్’ చెప్పిన గంటా
  • గంటాకు ధన్యవాదాలు చెబుతూ చిరు స్పందన
  • కోవిడ్ -19 పై చిరంజీవి సందేశంపై గంటా ప్రశంస 

ప్రముఖ నటుడు చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన సందర్భంగా ‘వెల్ కమ్’ చెబుతూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన పోస్ట్ పై చిరు స్పందించారు. ‘థ్యాంక్యూ మై బ్రదర్..’ అంటూ బదులిచ్చారు. ఈ సందర్భంగా ‘కరోనా’ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఇరవై ఒక్క రోజుల లాక్ డౌన్ ను వైజాగ్ ఎలా ఎదుర్కొంటోంది? ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండాలన్న సందేశాన్ని ప్రజలకు చెప్పడంలో మీ వంతు కృషి మీరు చేస్తున్నారని ఆశిస్తున్నానని చిరంజీవి అన్నారు.

దీనిపై గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ, ‘యస్. అన్నయ్యా..’ అంటూ ప్రతి స్పందించారు. దేవుడి దయ వల్ల తొందర్లోనే అన్నీ సర్దుకుంటాయని ఆశిస్తున్నానని అన్నారు. ’కోవిడ్-19‘ గురించి ప్రజలను చైతన్య పరుస్తూ మీరిచ్చిన సందేశానికి మంచి స్పందన వచ్చిందని, మంచి చొరవ తీసుకున్నారంటూ చిరంజీవిని ప్రశంసించారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News