Koratala Siva: తెలుగు రాష్ట్రాలకు తమ విరాళాన్ని ప్రకటించిన కొరటాల, అనిల్ రావిపూడి

Corona Virus

  • రోజులు భారంగా గడుపుతున్న సామాన్యులు 
  • కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా చర్యలు 
  • పదేసి లక్షల చొప్పున విరాళాలు  

కరోనా వైరస్ విరుచుకుపడటంతో దేశం అతలాకుతలమవుతోంది. ప్రజలంతా భయాందోళనలతో ఇళ్లకి పరిమితమయ్యారు. అయితే, బయటికి వెళితే తప్ప కొందరిది ఇల్లు గడవని పరిస్థితి. అలా అని చెప్పేసి బయటికి వెళ్లలేని పరిస్థితి. దాంతో చాలామంది రోజులను చాలా భారంగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఒక వైపున కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే, మరో వైపున ఆర్థికంగా ప్రజలను ఆదుకోవడానికి గాను అనేక ప్రణాళికలను చేపడుతున్నాయి.

ఈ విపత్తును ఎదుర్కోవడానికిగాను తమవంతు సాయాన్ని అందిస్తామంటూ టాలీవుడ్ సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలు .. దర్శకులు తమ విరాళాలను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తాజాగా ఆ జాబితాలో కొరటాల శివ .. అనిల్ రావిపూడి కూడా చేరిపోయారు. ఈ ఇద్దరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి వేరు వేరుగా 10 లక్షల రూపాయలను ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు.

Koratala Siva
Anil Ravipudi
Corona Virus
Tollywood
  • Loading...

More Telugu News