KTR: కేటీఆర్ కు ఏపీ మంత్రి గౌతంరెడ్డి ఫోన్!

AP minister Gowtham Reddy calls KTR

  • హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా తరలిన జనం
  • సరిహద్దుల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
  • ఎక్కడివారు అక్కడే ఉండేలా చూడాలని కోరిన మంత్రి 

హైదరాబాద్ నుంచి ఏపీలోని స్వగ్రామాలకు పయనమైన వారు మార్గమధ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ తో ఏపీ మంత్రి గౌతంరెడ్డి ఫోన్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా ఎవరూ ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని అన్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండేలా చొరవ చూపాలని కోరారు.

అలాగే ఇకపై ఎవరూ ప్రయాణాలను పెట్టుకోవద్దని కోరారు. ఒక్కరు చేసే పొరపాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని... అసత్యాలను ప్రచారం  చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

KTR
TRS
Gowtham Reddy
YSRCP
Lockdown
  • Loading...

More Telugu News