Telangana: చీపురు పట్టి వంటిల్లు శుభ్రం చేసిన పొన్నాల.. ఫొటో వైరల్!

Congress leader Ponnala laxmaiah cleans his home
  • దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్
  • ఇంటిపట్టునే ఉండి ఇంటి పనుల్లో సాయం చేస్తున్న పురుషులు
  • పొన్నాలపై ప్రశంసల వర్షం
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో చాలామంది తమకు దొరికిన అవకాశాన్ని పలు రకాలుగా సద్వినియోగం చేసుకుంటున్నారు. మరికొందరు ఇంటి పనుల్లో భార్యకు సాయపడుతున్నారు. పనిమనుషులు కూడా ఇళ్లకే పరిమితం కావడంతో ఇంటి పట్టున ఉంటున్న భర్తలు వారి లేని లోటు తీరుస్తూ అర్ధాంగికి పనిలో అర్ధభాగం సహకరిస్తున్నారు. ఈ విషయంలో రాజకీయ నాయకులు కూడా అతీతులేం కాదని తాజాగా బయటకు వచ్చిన ఓ ఫొటో నిరూపిస్తోంది.

తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య చీపురుపట్టి వంటగదిని శుభ్రం చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అత్యంత సాధారణ వ్యక్తిలా చీపురు పట్టుకుని ఇల్లు ఊడుస్తున్న ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Telangana
Ponnala Lakshmaiah
Congress
Lockdown

More Telugu News