UK: ఏ అనారోగ్యమూ లేకున్నా... కరోనా బారినపడి మరణించిన అతి పిన్న వయస్కురాలు ఈమే!

21 years cheloi died due to corona

  • యూకేలో మరణించిన చలోయి మిడిల్టన్
  • నివాళులు అర్పించిన ఎంతో మంది
  • సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్

ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు. అంతవరకూ ఆమెకు ఎటువంటి అనారోగ్యమూ లేదు. అయితే, కరోనా మహమ్మారి ఆమె ప్రాణాలను కబళించి వేసింది. ఎలాంటి రోగాలూ లేకుండా కరోనా బారినపడి మరణించిన అతి పిన్న వయస్కురాలు ఈమెనే అని వైద్యాధికారులు గుర్తించారు.

యూకేలోని బకింగ్‌ హామ్‌ షైర్‌ లో నివాసం ఉంటున్న చలోయి మిడిల్టన్ అనే యువతి కరోనా కారణంగా మృత్యువాత పడగా, ఆమె తల్లి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. దీన్ని చూసిన ఎంతో మంది చలోయికి నివాళులు అర్పించారు. ట్విట్టర్, ఫేస్‌ బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో చలోయ్ ఉదంతం ట్రెండింగ్ లో ఉంది. ఈ మహమ్మారిని ఎవరూ తేలికగా తీసుకోవద్దని, ప్రజలంతా ఇంట్లోనే వుండాలని, అదొక్కటే వైరస్ వ్యాప్తిని ఆపుతుందని ఈ సందర్భంగా చలోయి తల్లి విజ్ఞప్తి చేశారు.

UK
Corona Virus
Cheloi Midelton
Died
Social Media
  • Loading...

More Telugu News