Puducherry: 200 మందికి కూరగాయల పంపిణీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
- లాక్‌డౌన్ ఆదేశాలను ఉల్లంఘించిన ఎమ్మెల్యే
- కూరగాయల కోసం గుంపులు గుంపులుగా జనం
- సామాజిక దూరం పాటించని వైనం
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో దానిని అతిక్రమించి తన ఇంటి వద్ద కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుదుచ్చేరిలో జరిగిందీ ఘటన. కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ ఉత్తర్వులను కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్ కుమార్ ఉల్లంఘించారు.
లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కూరగాయల సంచులు పంపిణీ చేశారు. దాదాపు 200 మందికి వీటిని అందించారు. అయితే, సామాజిక దూరం పాటించకుండా గుంపులుగుంపులుగా జనం గుమికూడడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. లాక్‌డౌన్ ఆదేశాలను ఉల్లంఘించారంటూ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. కాగా, పుదుచ్చేరి వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి ఇప్పటికే ప్రకటించారు.