Chandrababu: రాజకీయాలకు అతీతంగా పోరాడండి: టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు

Chandrababu Video Conference with Party MLAs

  • పార్టీ ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్
  • వైద్యులు, సిబ్బందికి అభినందనలు
  • ఫ్రంట్‌లైన్ వర్కర్లకు శానిటేషన్ కిట్లు అందించాలని డిమాండ్

కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రాజకీయాలకు అతీతంగా పోరాడాలని పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ ఈ సూచనలు చేశారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, సిబ్బందికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మెడికల్, శానిటేషన్ కిట్లను ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News