Anupama parameswaran: గ్లామర్ పాత్రలకి నో చెబుతున్న అనుపమ!

Anupama Parameswaran

  • వరుస హిట్లు కొట్టిన అనుపమ
  • యూత్ లో ఆమెకి మంచి క్రేజ్ 
  • ఇటీవల కొన్ని ఆఫర్లు వదిలేసిన అనుపమ

తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసిన కథానాయికలలో అనుపమ పరమేశ్వరన్ కూడా కనిపిస్తుంది. 'ప్రేమమ్' .. 'అ ఆ' .. 'శతమానం భవతి' సినిమాలతో తెలుగులో ఈ అమ్మాయికి క్రేజ్ పెరిగింది. ఆకర్షణీయమైన కళ్లతో .. అందమైన నవ్వుతో కనిపించే ఈ అమ్మాయి, తెలుగులో తన జోరు చూపించడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో అనుపమ తన జోరు చూపించలేకపోయింది. 'రాక్షసుడు' సక్సెస్ తరువాత కూడా ఆమెను పలకరించిన అవకాశాలు తక్కువ.

యువ కథానాయికలతో పోటీపడే అర్హతలు పుష్కలంగా వున్న అనుపమ వెనకబడిపోవడానికి కారణం, గ్లామరస్ గా కనిపించే పాత్రలను ఆమె అంగీకరించకపోవడమేనని అంటున్నారు. అనుపమకు ఆ మధ్య కొన్ని అవకాశాలు వెళ్లాయట. అయితే గ్లామర్ షో చేయడానికి ఆమె నిరాకరించడంతోనే ఆ అవకాశాలు జారిపోయాయని అంటున్నారు. అయితే అనుమప పద్ధతిగా కనిపిస్తేనే బాగుంటుందనేది ఆమె అభిమానుల మాట కూడా.

Anupama parameswaran
Rakshasudu Movie
Tollywood
  • Loading...

More Telugu News