nitin: నితిన్‌ పెళ్లి వాయిదా పడలేదు!

nitin marriage with shalini

  • ఏప్రిల్‌ 16న పెళ్లి
  • నాగర్‌కర్నూల్‌లో సింపుల్‌గా వేడుక
  • ఆ తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్

టాలీవుడ్‌ హీరో నితిన్ పెళ్లి వాయిదా పడిందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ముందుగా అనుకున్న ప్రకారమే ఏప్రిల్ 16న వివాహం జరగనుందని తెలిసింది. అయితే, దుబాయ్‌లో కాకుండా నాగ‌ర్‌క‌ర్నూల్‌లో ఆయన పెళ్లి జరగనుంది.

ఇరు వర్గాల కుటుంబ స‌భ్యుల మ‌ధ్య‌నే వివాహం జ‌రగ‌నుంద‌ని, ఆ తర్వాత కొన్ని రోజులకి హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్ష‌న్ నిర్వహించాలని నితిన్ త‌ల్లిదండ్రులు భావిస్తున్నారు. డాక్టర్‌ సంపత్‌కుమార్‌, నూర్జహాన్‌ దంపతుల కుమార్తె షాలినితో నితిన్‌కు నిశ్చితార్థమైన విష‌యం తెలిసిందే. అయితే, కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ పెళ్లి వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. పెళ్లి వాయిదా వేయబోమని ఇప్పటికే నితిన్‌ కుటుంబ సభ్యులు తెలిపారు.

nitin
Tollywood
Corona Virus
  • Loading...

More Telugu News