Ramgopal varma: 'ఇది పోలీస్ హెచ్చరిక' అంటూ రామ్ గోపాల్ వర్మ పోస్ట్

Ram Gopal Varma posts a tweet

  • ఉగాది పచ్చడి కావాలంటే ఇంట్లో ఉండండి
  • ఒళ్లంతా పచ్చడి కావాలంటే బయటకు రండి
  • ఓ ట్వీట్  చేసిన రామ్ గోపాల్ వర్మ

‘కరోనా’ కట్టడి నిమిత్తం దేశంలోని పలు రాష్ట్రాలు సహా ఏపీ, తెలంగాణలలో లాక్ డౌన్   అమలవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, రవాణా ఆంక్షలు కట్టుదిట్టంగా అమలవుతున్నాయి. అయినాసరే, మొండికేసి  బయటకెళుతున్న వారు లేకపోలేదు. నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు లాఠీలు ఝళిపించడం, వాహనాలు సీజ్ చేయడం జరుగుతోంది.

ఇక రేపు ఉగాది పర్వదినం కావడంతో తమ స్వగ్రామాలకు వెళ్లాలనుకున్నప్పటికీ వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఉగాది పచ్చడి కావాలంటే ఇంట్లో ఉండండి. ఒళ్లంతా పచ్చడి కావాలంటే బయటకు రండి’ అనేది పోలీస్ హెచ్చరిక అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

Ramgopal varma
Director
Ugadi
Corona Virus
Lockdown
  • Error fetching data: Network response was not ok

More Telugu News