Hanta Virus: చైనాలో మళ్లీ మొదలు... ఈసారి హంటా వైరస్!

Hanta virus returns China as first death registered

  • చైనాలో హంటా వైరస్ తో తొలి మరణం నమోదు
  • గాలి ద్వారా వ్యాపించే వైరస్
  • గతంలోనూ చైనాలో మరణమృదంగం మోగించిన హంటా

చైనాలో కరోనా వైరస్ సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. 3 వేలకు పైగా మరణాలతో చైనా అల్లాడిపోయింది. ఇప్పుడిప్పుడే అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ఇంతలోనే మరో ఉపద్రవం వచ్చిపడింది. ఈసారి కరోనా కాకుండా మరో వైరస్ విజృంభణ మొదలైంది. దాని పేరు హంటా వైరస్. చైనాలోని యునాన్ ప్రావిన్స్ కు చెందిన ఓ వ్యక్తి హంటా వైరస్ ప్రభావంతో మరణించాడు.

చైనాలో ఈ వైరస్ గతంలో తీవ్ర ప్రభావం చూపింది. 1950 నుంచి 2007 మధ్య కాలంలో దీని ప్రభావంతో 15 లక్షల మంది వ్యాధిగ్రస్తులు కాగా, 46 వేల మంది ప్రాణాలు విడిచారు. హంటా వైరస్ ఎలుకల కారణంగా వ్యాపిస్తుందని గుర్తించారు. కరోనా శాంతిస్తుందనుకుంటున్న తరుణంలో మరో వైరస్ వెలుగు చూడడంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. అయితే ఈ హంటా వైరస్ కు వ్యాక్సిన్ ఉండడం కాస్తలో కాస్త ఉపశమనం అని చెప్పాలి. ఇది గాలి ద్వారా మాత్రమే సోకుతుంది. మనిషి నుంచి మనిషికి వ్యాపించదు.

  • Loading...

More Telugu News