Kajal Agarwal: మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న కాజల్!

Kajal Agarwal

  • ఖాళీగా ఉండటం నాకు ఇష్టం ఉండదు 
  •  ఎప్పుడూ కొత్తగా ఏదోఒకటి నేర్చుకుంటూ వుంటాను 
  •  సంతృప్తికరంగా ఉందన్న కాజల్

కరోనా కారణంగా షూటింగులన్నీ కూడా కేన్సిల్ అయ్యాయి. దాంతో తారలంతా కూడా స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. ఎవరి మనసుకు నచ్చిన పనులను వాళ్లు చేస్తూ, కాలక్షేపం చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా తాను ఇంటి పట్టున ఉన్నప్పటికీ, సమయాన్ని వృథా చేయడం లేదని కాజల్ చెప్పింది.

ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవడం తనకి అలవాటనీ, తాను నేర్చుకునేది జీవితంలో ఎంతవరకూ ఉపయోగపడుతుందనే విషయాన్ని గురించి తాను ఎప్పుడూ ఆలోచించనని అంది. తన మనసుకి నచ్చిన పనులను చేస్తూ వెళతాననీ, అప్పుడే తనకి సంతోషంగా అనిపిస్తూ ఉంటుందని చెప్పింది. అలా ప్రస్తుత పరిస్థిలోతుల్లో తాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నానని అంది. సమయాన్ని వృథా చేయడం లేదనే సంతృప్తితో  రోజులు గడుస్తున్నాయని చెప్పుకొచ్చింది.

Kajal Agarwal
Actress
Tollywood
  • Loading...

More Telugu News