Sudheer Babu: మహేశ్ బాబు నుంచి నేను నేర్చుకున్నవి ఇవే: హీరో సుధీర్ బాబు

Sudheer Babu

  • మహేశ్ చాలా సింపుల్ గా ఉంటాడు 
  • ఆయన హార్డ్ వర్క్ ఆశ్చర్యపరుస్తుంది 
  • తోబుట్టువుల పట్ల బాధ్యతగా ఉంటాడన్న సుధీర్ బాబు

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సుధీర్ బాబు మాట్లాడుతూ, మహేశ్ బాబును గురించి ప్రస్తావించాడు. "తనతో ఒక సినిమా చేయాలనుంది అంటే, మహేశ్ బాబు వెంటనే డేట్స్ ఇస్తాడు. కానీ ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది పెద్ద నిర్మాతలు సిద్ధంగా వున్నారు. ఆ స్థాయివాళ్లు తీయడమే కరెక్ట్.

మహేశ్ బాబు తన తల్లిదండ్రులని .. పిల్లలను మాత్రమే కాదు, తోబుట్టువులను కూడా ఎంతో బాగా చూసుకుంటాడు. వాళ్ల పట్ల ఎంతో బాధ్యతగా ఉంటాడు. ఈ కాలంలో అలా ఉండటం విశేషం. మహేశ్ బాబు అంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు. ఇక తన సినిమాలకి సంబంధించిన విషయంలో ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఆయన అంకితభావం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇలా మహేశ్ బాబు నుంచి నేను నేర్చుకున్న విషయాలు చాలానే వున్నాయి" అని చెప్పుకొచ్చాడు.

Sudheer Babu
Mahesh Babu
Tollywood
  • Loading...

More Telugu News