Venkatesh: 10 కోట్లకి వెళ్లిన వెంకటేశ్ పారితోషికం?

 Venkatesh charges Ten crores

  • వెంకటేశ్ కి హిట్  తెచ్చిన 'ఎఫ్ 2'
  • 'ఎఫ్ 3' సినిమాకి సన్నాహాలు
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు

తెలుగులో సీనియర్ స్టార్ హీరోలుగా చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ .. నాగార్జున సుదీర్ఘ కాలంగా తమ హవాను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి సొంత సినిమాలే చేసుకుంటూ వెళుతుండటం వలన, ఆయన పారితోషికం గురించిన విషయం పట్ల అభిమానులు పెద్దగా ఆసక్తిని కనబరచడం లేదు. బాలకృష్ణ విషయానికే వస్తే ఇటీవల ఆయన తన పారితోషికాన్ని పెంచేశారు. ఒక్కో సినిమాకి తొమ్మిది నుంచి పది కోట్ల వరకూ తీసుకుంటున్నారట.

ఇక తాజాగా వెంకటేశ్ కూడా తన పారితోషికాన్ని పెంచేసినట్టుగా తెలుస్తోంది. 'ఎఫ్ 3' సినిమాకి ఆయన 10 కోట్లను డిమాండ్ చేశారట. అయితే 'దిల్' రాజుతో వున్న సాన్నిహిత్యం కారణంగా, ఆల్రెడీ 'ఎఫ్ 2' సక్సెస్ ఇచ్చినందువలన కొంత తగ్గినట్టు చెబుతున్నారు. ఆ తరువాత సినిమా నుంచి మాత్రం ఆయన 10 కోట్లకి తగ్గకూడదనే ఉద్దేశంతో వున్నారని అంటున్నారు. ఒకటి రెండు హిట్లు పడితే నాగార్జున కూడా తన పారితోషికాన్ని పెంచే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.

Venkatesh
Dil Raju
Anil Ravipudi Movie
  • Loading...

More Telugu News