Donald Trump: 'చైనీస్ వైర‌స్‌' వ్యాఖ్యలపై కాస్త తగ్గి.. కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌

trump on corona virus

  • ట్రంప్‌ వ్యాఖ్యలు జాత్యాహం‌కార వ్యాఖ్య‌లంటూ అభ్యంతరాలు 
  • మరోసారి ట్వీట్లు చేసిన ట్రంప్
  • ఆసియన్ అమెరికన్ కమ్యూనిటీ మొత్తానికీ భద్రతనివ్వాలి
  • వారు చాలా అద్భుతమైన ప్రజలు.. కలిసి పనిచేద్దామన్న ట్రంప్

అమెరికాలో కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో కరోనాను 'చైనీస్ వైరస్‌' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చైనాకు ఆగ్రహం తెప్పించాయి. అంతేకాదు, అమెరికాలో ఆసియాకు చెందిన వారిపై దాడులు పెరిగాయి. వీటన్నింటికీ ట్రంప్ వ్యాఖ్యలే కారణమని విమర్శలు వచ్చాయి.

ఆయన చేసిన వ్యాఖ్యలు జాత్యాహంకార వ్యాఖ్య‌లంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గి ట్వీట్లు చేశారు. 'ఆసియన్ అమెరికన్ కమ్యూనిటీతో పాటు ప్రపంచంలోని ఆసియా ప్రజలందరికీ భద్రతనివ్వడం చాలా ముఖ్యం. వారు చాలా అద్భుతమైన ప్రజలు' అని ట్రంప్ అన్నారు.  

కరోనా వైర‌స్ వ్యాప్తికి వారిని నిందించ‌డం స‌రికాదని ట్రంప్ చెప్పారు. 'ఈ వైర‌స్ నిర్మూల‌న‌కు వారంతా మనతో క‌లిసి ప‌నిచేస్తున్నారు. అంద‌ర‌మూ ఆ మ‌హ‌మ్మారిపై విజ‌యం సాధిద్దాం' అని అన్నారు.

  • Loading...

More Telugu News