Kalyan Dev: చిరూ చిన్నల్లుడికి జోడీగా అవికా గోర్

Sridhar Seepana Movie

  • 'చిన్నారి పెళ్లికూతురు'తో పరిచయం 
  • 'ఉయ్యాలా జంపాలా'తో ఫస్టు హిట్ 
  • కల్యాణ్ దేవ్ జోడీగా సినిమా  

'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న అవికా గోర్, ఆ తరువాత 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఆ సినిమాతో యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది. 'సినిమా చూపిస్తమావ'తో మరో హిట్ ను సొంతం చేసుకున్న ఈ అమ్మాయి, తెలుగులో ఒక రేంజ్ లో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన తెలుగులో గ్యాప్ తీసుకుంది.

అలా 'రాజుగారి గది 3' చేసిన అవికా, చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ జోడీగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. 'విజేత' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కల్యాణ్ దేవ్, 'సూపర్ మచ్చి'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ఆ తరువాత సినిమాగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం అవికా గోర్ ను తీసుకున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు.

Kalyan Dev
Avika Gor
Sridhar Seepana Movie
  • Loading...

More Telugu News