Allu Arjun: ఖరీదైన కార్లను అద్దెకిచ్చే వ్యాపార సంస్థలో షేర్ తీసుకున్న అల్లు అర్జున్!
- సంస్థలో 7 శాతం వాటాల కొనుగోలు
- ఓ రాజకీయ నేత సలహాతో కొత్త వ్యాపారం
- టాలీవుడ్ లో చర్చ
ఇటీవలే 'అల వైకుంఠపుములో' చిత్రంతో నాన్ 'బాహుబలి' రికార్డులను సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. లగ్జరీ కార్లను అద్దెకిస్తున్న ఓ కంపెనీలో అల్లు అర్జున్ 7 శాతం వాటాలను కొనుగోలు చేశాడని సమాచారం.
ఇదే సంస్థలో ఇప్పటికే ఓ ప్రముఖ రాజకీయ నేత కూడా భాగస్వామిగా ఉండగా, ఆయన సలహాతోనే బన్నీ, ఈ వ్యాపారంలోకి వచ్చాడని తెలుస్తోంది. ప్రముఖుల ఇళ్లలో శుభకార్యాలు జరిగే వేళ, వచ్చే సెలబ్రిటీల ప్రయాణానికి ఈ సంస్థ ఖరీదైన కార్లను సరఫరా చేస్తూ ఉంటుంది. ఇప్పటివరకూ సినిమా థియేటర్లు, పబ్ ల వ్యాపారంలో ఉన్న బన్నీ, తనకు పెద్దగా పరిచయం లేని కార్ల అద్దె బిజినెస్ లోకి దిగడంపై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.