surya: ఇండియా మరో ఇటలీ కాకూడదు: సూర్య
- కరోనా వేగంగా వ్యాపిస్తోంది
- జల్లికట్టు వంటి వాటి విషయంలో రోడ్డెక్కి పోరాడాం
- ప్రస్తుతం కరోనాపై ఇంట్లో ఉండే పోరాడుదాం
- చైనా కంటే ఇటలీలోనే కరోనా కారణంగా ప్రాణనష్టం అధికం
కరోనా వేగంగా వ్యాపిస్తోందని, ప్రజల్లో మరింత అవగాహన కలిగించాలని సినీనటుడు సూర్య అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ట్విట్టర్ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు. వరదలు, తుపాన్లు, జల్లికట్టు వంటి వాటి విషయంలో రోడ్డెక్కి పోరాడామని, ప్రస్తుతం కరోనాపై ఇంట్లో ఉండే పోరాడుదామని పిలుపునిచ్చారు. చైనా కంటే ఇటలీలోనే కరోనా కారణంగా ప్రాణనష్టం అధికంగా ఉందని ఆయన గుర్తు చేశారు. కరోనా తీవ్రతను గ్రహించకుండా ఇటలీ ప్రజలు బయట తిరగడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. భారత్ మరో ఇటలీ కాకూడదని ఆయన అన్నారు.
సామాజిక దూరం పాటించాలని సూర్య కోరారు. ముఖాన్ని చేతులతో ముట్టుకోకూడదని, జ్వరం, దగ్గుతో బాధ పడుతుంటే కరోనా వైరస్ సోకినట్లు కాదని, అయినప్పటికీ ఆరు రోజులు ఎవరితోనూ కలవకుండా ఉండాలని, అప్పటికీ సమస్య ఉంటే ఆసుపత్రికి వెళ్లాలని కోరారు. భారత్‌లోనూ కరోనా వేగంగా విస్తరిస్తోందని అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.