Bhadradri Kothagudem District: మనవరాలి పెళ్లిని వాయిదా వేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే!

MLA Vanama postpones his Granddaughter marriage
  • వచ్చే నెల 4న జరగాల్సిన వివాహం
  • కేసీఆర్ సహా వేలాది మందికి ఆహ్వానం
  • ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపు
తెలంగాణలోనూ కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన మనవరాలి పెళ్లిని వాయిదా వేశారు. వచ్చే నెల 4న వివాహం జరగాల్సి ఉండగా వాయిదా వేస్తున్నట్టు నిన్న ప్రకటించారు. మూడు దశాబ్దాల తర్వాత తమ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం ఇదని, అయితే, కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రబలకుండా ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. తన మనవరాలి వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సహా వేలాదిమందిని ఆహ్వానించామని అయితే, పరిస్థితులు ఇప్పుడు ఒక్కసారిగా మారిపోవడంతో వివాహాన్ని వాయిదావేసుకోక తప్పలేదన్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 33 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు అమలు చేస్తోంది.
Bhadradri Kothagudem District
Vanama venkateswara rao
marriage
post pone
Telangana

More Telugu News