10 th class: ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చర్యలు
- ‘కరోనా’ నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పదో తరగతి పరీక్షలు
- ప్రశ్నా పత్రాలు, ఓఎంఆర్ షీట్లు, బుక్ లెట్ ల రవాణాకు అనుమతి
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రశ్నా పత్రాలు, ఓఎంఆర్ షీట్లు, బుక్ లెట్ ల రవాణాకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయినట్లు చెప్పింది. ‘కరోనా’ నేపథ్యంలో పరీక్షల్లో విద్యార్థులు కూర్చునే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటామని, ఎవరైనా విద్యార్థులు జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతుంటే వారికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.