Chiranjeevi: చరణ్ జోడీగా ఛాన్స్ పట్టేసిన రష్మిక

Koratala Siva Movie

  • వరుస సక్సెస్ లతో జోరుమీదున్న రష్మిక 
  •  సుకుమార్ మూవీలో బన్నీ జోడీగా ఛాన్స్ 
  •  కొరటాల సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తాజా చిత్రం రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా కాజల్ ను తీసుకున్నారు. ఆమె ఈ విషయాన్ని ధ్రువీకరించింది కూడా. ఇక ఈ సినిమాలో చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకు జోడీగా సమంత చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత కైరా అద్వాని డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది.

తాజాగా రష్మిక పేరు తెరపైకి వచ్చింది. చరణ్ జోడీగా రష్మికను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఒక వైపున సుకుమార్ సినిమాలో బన్నీ సరసన నటించడానికి రష్మిక సెట్స్ పైకి వెళ్లనుంది. మరో వైపున చరణ్ జోడీగా అలరించడానికి కూడా ఆమె సిద్ధమవుతోందన్న మాట. మెగా హీరోలిద్దరి సినిమాల్లోను ఒకేసారి ఛాన్స్ కొట్టేసినప్పుడు, రష్మికను అదృష్టవంతురాలని కాక మరేమంటారు?

Chiranjeevi
Kajal Agarwal
Charan
Rashmika Mandanna
  • Loading...

More Telugu News