Pavan kalyan: పారితోషికాన్ని పెంచుకుంటూపోతున్న పూజ హెగ్డే

Harish Shankar Movie

  • వరుస సినిమాలతో బిజీ 
  •  వరుస విజయాలతో క్రేజ్ 
  •  పవన్ సినిమాలోను ఛాన్స్?   

ఇప్పుడు పూజ హెగ్డే టైమ్ నడుస్తోంది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు .. విజయాలు ఆమె ఖాతాలో చేరిపోతున్నాయి. దాంతో దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో ఆమెను కథానాయికగా తీసుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. దాంతో ఆమె తన పారితోషికాన్ని రెండున్నర కోట్లు చేసిందట. అంతకి మించి తక్కువ అయితే కష్టమని చెప్పేస్తోందట.

అఖిల్ కి జోడీగా ఆమె చేసిన సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగా, ప్రభాస్ తో సినిమా సెట్స్ పై వుంది. ఇక హరీశ్ శంకర్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలోను కథానాయికగా ఆమె పేరే వినిపిస్తోంది. ప్రభాస్ .. పవన్ సరసన సినిమాలు హిట్ అయితే పూజ హెగ్డే పారితోషికం రెట్టింపు అయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని అంటున్నారు. ప్రస్తుతానికి పూజ హెగ్డేకి పోటీ ఇచ్చే కథానాయికలు దగ్గరలో లేరు. కనుక ఆమె జోరు మరికొన్నాళ్ల పాటు సాగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Pavan kalyan
Pooja Hegde
Harish Shanakar Movie
  • Loading...

More Telugu News