Pawan Kalyan: భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులకు పవన్ కల్యాణ్ స్మృత్యంజలి

Pawan pays rich tributes to martyrs

  • మార్చి 23 ఓ విషాదం దినం అని అభివర్ణించిన పవన్
  • దేశం కోసం ఆ ముగ్గురు ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారని వెల్లడి
  • ఆ యోధులకు ప్రతిరోజు నివాళులు అర్పించాలని పిలుపు

భారతదేశ చరిత్రలో మార్చి 23 ఓ విషాద దినం అని జనసేనాని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. భరతమాత ముద్దుబిడ్డలు భగత్ సింగ్, సుఖ్ దేవ్ థాపర్, రాజ్ గురులు దేశం కోసం మృత్యువును చుంబించిన రోజని పేర్కొన్నారు.

భారతదేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి అమరులయ్యారని, ప్రతి ఒక్క భారతీయుడు ఈ ముగ్గురు యోధులకు ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజూ నివాళులు అర్పించాలని సూచించారు. ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వారి త్యాగాల ఫలితమేనని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. జనసైనికుల తరఫున కూడా తాను ఘనంగా నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. ఆ మహోన్నత మూర్తులకు అభివందనాలు అంటూ ట్విట్టర్ లో స్పందించారు.

Pawan Kalyan
Janasena
Bhagat Singh
Sukhdev Thapar
Rajguru
  • Loading...

More Telugu News