Corona Virus: తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు

coronavirus cases in telangana

  • 30కి చేరిన కరోనా కేసులు
  • కరీంనగర్‌లో ఇండోనేషియా బృందంతో కలిసి తిరిగిన జిల్లా వాసికి కరోనా
  • రాష్ట్రానికి లండన్ నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా
  • ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన మరో 21 ఏళ్ల యువకుడికి పాజిటివ్‌ 

తెలంగాణలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య మరింత పెరిగిపోయింది. తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 30కి చేరింది. తాజాగా ప్రభుత్వం దీనిపై బుటిలెన్ విడుదల చేసింది. కరీంనగర్‌లో ఇండోనేషియా బృందంతో కలిసి తిరిగిన జిల్లా వాసికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలిందని తెలిపింది. అలాగే, రాష్ట్రానికి లండన్ నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా సోకిందని, ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన మరో 21 ఏళ్ల యువకుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్లూహెచ్‌వో) హెల్త్ ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్నామని, ప్రైవేటు ఆసుపత్రులలో ఎలెక్టీవ్ సర్జరీలను నిలిపివేసి, కరోనా బాధితులకు వైద్య చికిత్స అందించేందుకు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపింది.

  • Loading...

More Telugu News