Mahesh Babu: పరశురామ్ తోనే మహేశ్ బాబు మూవీ ఖరారు

Parashuram Movie

  • మహేశ్ బాబు 27వ సినిమాకి సన్నాహాలు 
  • జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • వచ్చే వేసవిలో విడుదల  

మహేశ్ బాబు తన 27వ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వంశీ పైడిపల్లితో చేయవలసి వుంది. ఇక దర్శకుడు పరశురామ్ 14 రీల్స్ బ్యానర్ పై తన తదుపరి సినిమాను చేయవలసి వుంది. అయితే కొన్ని కారణాల వలన వంశీ పైడిపల్లి ప్రాజెక్టును పక్కన పెట్టిన మహేశ్ బాబు, గతంలో పరశురామ్ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ముందుగా అనుకున్న ప్రకారం తమ ప్రాజెక్టును పూర్తి చేయాలని 14 రీల్స్ వారు పరశురామ్ కి తేల్చిచెప్పినట్టుగా వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో మహేశ్ బాబుతో పరశురామ్ సినిమా ఉంటుందా? లేదా? అనేది సందేహంగా మారింది. అయితే ఇప్పుడు ఆ సందేహానికి తెరపడిపోయింది. అంతా మాట్లాడుకుని మహేశ్ బాబు - పరశురామ్ ప్రాజెక్టును సెట్ చేసుకున్నారు. మైత్రీ ..14 రీల్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Mahesh Babu
Vamshi paidipalli
Parashuram Movie
  • Loading...

More Telugu News