WHO: లాక్ డౌన్ ప్రకటించినంత మాత్రాన ఉపయోగం లేదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- లాక్ డౌన్ ప్రకటిస్తున్న దేశాలు, రాష్ట్రాలు
- మొదట వైరస్ సోకిన వారిని గుర్తించాలన్న డబ్ల్యూహెచ్ఓ
- వైరస్ సోకినవారిని గుర్తించకుండా ఏమీ చేయలేరన్న డబ్ల్యూహెచ్ఓ నిపుణుడు
కరోనా మహమ్మారిని తుదముట్టించే క్రమంలో తెలుగు రాష్ట్రాలు సైతం లాక్ డౌన్ ప్రకటించాయి. దేశాలకు దేశాలే లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నాయి. అయితే లాక్ డౌన్ ప్రకటించినంత మాత్రాన కరోనాను ఓడించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హైరిస్క్ నిపుణుడు మైక్ ర్యాన్ అభిప్రాయపడ్డారు.
ఈ మహమ్మారిపై పోరాటంలో విజయం సాధించాలంటే మొదట వైరస్ సోకిన వారిని, అనారోగ్యంపాలైన వారిని గుర్తించాలని సూచించారు. ఆపై వారందరినీ ఐసోలేషన్ కు తరలించి, వారు కలిసిన వారిని కూడా ఐసోలేషన్ లో ఉంచాలని వివరించారు. అంతేతప్ప, వైరస్ సోకిన వారిని గుర్తించకుండా లాక్ డౌన్ ప్రకటిస్తే ఫలితం ఉండదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని అన్నారు.