RGV: పార్వతీపురం పోలీసుల కరోనా ప్రచారంపై వర్మ వ్యాఖ్యలు

Ram Gopal Varma responds on Parvathi Puram police

  • కరోనాపై పార్వతీపురం పోలీసుల టిక్ టాక్ వీడియో
  • సంపూర్ణేష్ బాబులా బఫూన్ చేష్టలు చేయవద్దని సూచన
  • పోలీస్ స్టామినా చూపించాలంటూ ట్వీట్

కరోనా నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ పార్వతీపురం పోలీసులు అల వైకుంఠపురములో పాటతో టిక్ టాక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే. నెట్టింట్లో ఇది వైరల్ గా మారుతోంది. దీనిపై విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. "పోలీసులు తామేం చేశారో తెలుసుకోలేకపోవచ్చు కానీ, బయటి నుంచి నాలాంటి ప్రజానీకం చూస్తుంటారు. సంపూర్ణేష్ బాబు తరహాలో ఇలాంటి బఫూన్ చేష్టలను చేయవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కరోనా విజృంభిస్తున్న ఇలాంటి తరుణంలో పోలీస్ స్టామినా ఏంటో చూడాలనుకుంటున్నాను తప్ప ఇలాంటి జోకులను కాదు" అంటూ ట్వీట్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News