Peacock: హైదరాబాదులో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లపైకి వచ్చిన నెమళ్లు

Peacocks appears on Hyderabad roads

  • దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ
  • హైదరాబాదులో జనసంచారం లేక బోసిపోయిన రోడ్లు
  • కేబీఆర్ పార్క్ వద్ద నెమళ్ల సందడి

కరోనాపై పోరులో భాగంగా జనతా కర్ఫ్యూ దిగ్విజయంగా నడుస్తోంది. హైదరాబాదులో ఎన్నడూ చూడని పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం కావడంతో ప్రధాన రోడ్లన్నీ జనసంచారం లేక బోసిపోయాయి. అయితే బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. కొన్ని నెమళ్లు రోడ్డుపైకి వచ్చి ఆహారం తీసుకుంటూ కనువిందు చేశాయి. వాహనాల రొద లేకపోవడం, జనసమ్మర్ధం అస్సలు కనిపించకపోవడంతో ఆ మయూరాలు స్వేచ్ఛగా విహరిస్తూ కెమెరా కంటికి చిక్కాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News