sonu sood: అమ్మ చెప్పిన చిన్న విషయాలు ఎంత పెద్దవో ఇప్పుడు అర్థమైంది: సోనూసూద్

sonu sood on corona

  • బాల్యంలో నా తల్లి చెప్పిన మాటల్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నా
  • సబ్బుతో చేతులు బాగా శుభ్రం చేసుకోమని అమ్మ చెప్పేది
  • జేబులో ఎప్పుడు కర్చీఫ్‌ పెట్టుకోవాలని చెప్పేది
  • ప్రస్తుతం ప్రపంచానికి పరీక్ష ఎదురవుతుంది 

బాల్యంలో తన తల్లి చెప్పిన మాటల్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నానని సినీ నటుడు సోనూసూద్‌ ఓ వీడియో పోస్ట్ చేశాడు. సబ్బుతో చేతులు బాగా శుభ్రం చేసుకోమని ఆమె చెప్పేదని, ఎందుకు బయట తిరుగుతుంటావని కసురుకునేదని, ఇంట్లో ఉండమనేదని చెప్పాడు. హాయ్‌, హలో ఎందుకు చెప్పుకుంటున్నారని, సలామ్‌, నమస్తే పద్ధతులు  మర్చిపోయారా? అని నిలదీసేదని తెలిపాడు.

తుమ్ము, దగ్గు వస్తుంది కాబట్టి జేబులో ఎప్పుడు కర్చీఫ్‌ పెట్టుకోవాలని చెప్పేదని సోనూసూద్ గుర్తు చేసుకున్నాడు. మనకెన్నో విషయాలు నేర్పించాలని అమ్మ అనుకుంది కానీ ఆమె చెప్పే మాటలని ఎవరు విన్నారని ఆయన ప్రశ్నించాడు.  ప్రస్తుతం  ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంటోందని, కరోనాతో పోరాడుతోందని ఆయన చెప్పాడు.

అమ్మ చెప్పిన చిన్న విషయాలు ఎంత పెద్దవో ఇప్పుడు తనకు అర్థమైందని చెప్పుకొచ్చాడు. బడిలో తనకు పరీక్షలు జరుగుతున్నప్పుడు చాలా భయపడేవాడినని, భయపడొద్దని, అంతా సజావుగా జరుగుతుందని అమ్మ  చెప్పేదని ఆయన చెప్పాడు. ప్రస్తుతం ప్రపంచానికి పరీక్ష ఎదురవుతుందని,  అమ్మ మళ్లీ అదే చెబుతోందని, అంతా సజావుగా మారుతుందని ఆయన అన్నాడు. ఎవరూ బాధపడొద్దని ఆయన కోరాడు.

sonu sood
Tollywood
Corona Virus
Janata Curfew
  • Error fetching data: Network response was not ok

More Telugu News